DSC councelling from tomorrow | DSc-2008 candidates
Number of View: 25dsc councelling from tomorrow | dsc-2008 candidates
హైదరాబాద్: రేపటి నుంచి డిఎస్సీ 2008 అభ్యర్థులకు కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. ఎంపికైన అభ్యర్థుల జాబితాని కూడా విద్యాశాఖ విడుదల చేసింది. అనంతపురం మినహా అన్ని జిల్లాల జాబితాలను విడుదల చేశారు. డిఎడ్ అభ్యర్థులకు 30 శాతం పోస్టులు కేటాయించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని బిఇడి అభ్యర్థులు వ్యతిరేకించిన విషయం తెలిసిందే. వారు ఆందోళనకు దిగడంతో ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ వాయిదాలు పడుతూ వచ్చింది. వారు రెండవసారి హైకోర్టుకు వెళ్లారు. బిఇడి అభ్యర్థుల అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. ఈ నేపధ్యంలో రేపటి నుంచి డిఎస్సీ కౌన్సిలింగ్ మొదలవుతుంది.